TV9 Telugu
ఖరీదైన మరో ఇంటిని కొన్న స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా.
07 April 2024
ఒకప్పట్లా కాదు.. ఇప్పుడు హీరోయిన్లు ఆర్థిక భద్రత గురించి బానే ఆలోచిస్తున్నారు.. పెట్టుబడులు పెడుతున్నారు.
సంపాదించిన డబ్బును జల్సాలకు., లగ్జరీ అవసరాలకు మాత్రమే వెచ్చించకుండా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడతున్నారు.
ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా విషయానికొస్తే.. ఈ అమ్మడు కూడా ఇప్పుడు ఇలానే ఆస్తులు కూడపెడుతున్నారు.
తన సంపాదించిన డబ్బులతో కొందరు జల్సాలు చేస్తుంటే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు అంట.
ఇప్పటికే హైద్రాబాద్‌లో రెండు ఇళ్లను కొనుగోలు చేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరో ఇంటిని కూడా ఓన్ చేసుకున్నారు.
అదే ఇంట్లో తన నియర్ అండ్ డియర్స్‌తో కలిసి గృహ ప్రవేశం కూడా చేసి.. ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ నిత్యం తన ఫొటోస్ తో, కొత్త ఫోజులతో ఆకట్టుకుంటుంది.
ఎంతో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త చిక్కిపోయిందేంటీ అంటూ కామెంట్స్ ఎదుర్కుంటున్నారు రాశీ ఖాన్నా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి