పెళ్లి తర్వాత  గ్లామర్ డోస్ పెంచేస్తున్న అందాల రకుల్ .. 

29 June 2026

Pic credit - Instagram

Rajeev 

స్టార్ హీరోయిన్ల జాబితాలో ఒకప్పుడు టాప్‌లో నిలిచిన పేరు రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. 

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన క్యూట్ లుక్స్, స్మార్ట్ అటిట్యూడ్, బబ్లీ ఎనర్జీతో ఫ్యాన్స్ హార్ట్‌ని కొల్లగొట్టింది ఈ పంజాబీ సుందరి.

కానీ ఇప్పుడు ఆ గ్లామర్ గేమ్ కొంచెం కష్టాల్లో ఉంది.టాలీవుడ్‌లో ఆమె చేసిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కరెంట్ తీగ, ధృవ లాంటి సినిమాలు బ్యూటీతో పాటు నటనకు కూడా నిదర్శనమే.

కానీ టైమ్ గడుస్తున్న కొద్దీ.. ఇండస్ట్రీలో పోటీ పెరిగిన కొద్దీ రకుల్ తన గ్లామర్ డోస్‌ను పెంచింది. తన గ్లామర్ తో కుర్రాళ్లను కవ్విస్తుంది 

ఇప్పుడు ప్రతి ఈవెంట్‌లోనూ, సోషల్ మీడియాలోనూ, ఫ్యాషన్ ఫోటోషూట్లలోనూ ఆమె అందాల ఆరబోతే ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అయింది. 

పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్‌లు వెనక్కి తగ్గుతారని అనుకునే సమయంలో.. రకుల్ మాత్రం గ్లామర్ షోలో రెచ్చిపోతుంది.

భగ్నాని కుటుంబం కోడలైన తర్వాత ఆమె లుక్స్ మరింత హాట్‌గా మారాయి. స్టైలింగ్‌, డ్రెస్ సెన్స్‌, బోల్డ్ ఫొటోషూట్స్.. ఇవన్నీ ఆమె కొత్త ఐడెంటిటీగా మారాయి.