TV9 Telugu

19 January 2024

రిలేషన్ షిప్ పై హింట్ ఇచ్చిన రకుల్.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటు వరుస కథనాలు ట్రెండ్ అవుతున్నాయి.

అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వకపోయినా తన లవ్‌ లైఫ్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రకుల్‌.

కొద్ది రోజులుగా సిల్వర్‌ స్క్రీన్‌ మీద స్పీడు తగ్గినా, లవ్‌ లైఫ్‌కు సంబంధించి ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు రకుల్‌.

ముఖ్యంగా అమ్మడి పెళ్లి వార్తలు నార్త్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్‌పై స్పందించకపోయినా..

తనకు కాబోయే లైఫ్‌ పార్టనర్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రకుల్‌.

చాలా కాలంగా బాలీవుడ్ యాక్టర్‌, ప్రొడ్యూసర్‌ జాకీ భగ్నానితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు రకుల్‌.

రీసెంట్ ఇంటర్వ్యూలో తమ రిలేషన్‌ గురించి మాట్లాడారు. గ్లామర్ ఫీల్డ్ ఉన్న వాళ్ల గురించి చాలా రూమర్స్‌ వస్తుంటాయి.

నేను, జాకీ ఇద్దరం ఇదే ఫీల్ట్‌ ఉన్నాం కాబట్టి.. అలాంటి పరిస్థితులను జాగ్రత్తగా హ్యాండిల్‌ చేసుకోగలిగాం అన్నారు.