05 June 2025

టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నా.. బాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతున్న రకుల్..

Rajeev 

Pic credit - Instagram

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది. 18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించింది. 

2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో తన హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తరువాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్‌కుమార్ సరసన నటించింది. 

తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రకుల్.. ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది.

కానీ తెలుగులో సినిమాలు తగ్గించింది ఈ వయ్యారి భామ. తెలుగులో రకుల్ నటించిన లాస్ట్ ఎనిమిది సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.