TV9 Telugu
18 February 2024
టాలీవుడ్ సినిమాలపై హీరోయిన్ రాధిక ఆప్టే సంచలన కామెంట్స్.
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు రాధిక ఆప్టే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. RGV తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఈ అమ్మడు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ..
అందులో తెలుగు సినీ పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసింది. “నేను ఎక్కువగా కష్టపడిన పరిశ్రమ తెలుగు. ఎందుకంటే..
ఆ పరిశ్రమ చాలా పితృస్వామికమైనది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ పురుషాధిక్యత ఎక్కువగా ఉంది. పురుషులు గుడ్డి జాతీయవాదులు.
అక్కడ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు అసహనంగా ఉంది. మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు. సెట్ లో మూడో వ్యక్తిగా ట్రీట్ చేస్తారు.
అక్కడ నేను చాలాసార్లు చాలా ఇబ్బందులు పడ్డాను. ఏం చెప్పకుండానే ఇష్టమొచ్చినట్లు షూట్ క్యాన్సిల్ చేస్తారు.
అక్కడ నా అవసరం కొంతవరకే అని గ్రహించా” అంటూ చెప్పుకొచ్చింది.ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి