09 July 2024
తెలుగమ్మాయికి లక్కీ ఛాన్స్.. టిల్లు క్యూబ్‌లో హీరోయిన్గా ప్రియాంక..
Rajitha Chanti
Pic credit - Instagram
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్.
ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత అంతగా ఆఫర్స్ రాలేదు.
ఇటీవలే టిల్లు స్క్వేర్ చిత్రంలో మెరిసింది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీకి మరో క్రేజీ ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించనున్న టిల్లు క్యూబ్ చిత్రంలో ఈ బ్యూటీని కథానాయికగా ఎంపిక చేసినట్లుగా సమాచారం.
కొన్నాళ్లుగా ప్రియాంక జవాల్కర్ సరైన హిట్ లేక సతమతమవుతుంది. అయితే ఈ బ్యూటీని లీడ్‌గా తీసుకుంటున్నట్లు టాక్.
ఇక ఇదే నిజమైతే ఈ బ్యూటీకి ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ సినిమాతో తన కెరీర్ తిరిగి ట్రాక్ ఎక్కే అవకాశం ఉన్నట్లే.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక సోషల్ మీడియాలో ప్రియాంక జవాల్కర్ చాలా యాక్టివ్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ కూడా వైరలవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.