'మిత భాషిని.. ప్రెండ్స్‌ కూడా తక్కువే' నానీ హీరోయిన్‌ ముచ్చట్లు

May 09, 2024

TV9 Telugu

TV9 Telugu

తెరపై ఎంతోమంది కథానాయికలుగా కనిపించినా.. వారిలో మన ఇంటి అమ్మాయిలా ఉందనిపించుకొనే భామలు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి అమ్మాయే ప్రియాంక అరుళ్‌ మోహన్‌

TV9 Telugu

కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసిన ప్రియాంక.. ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ (2019)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది

TV9 Telugu

ఆ తర్వాత శర్వానంద్‌ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది

TV9 Telugu

‘డాక్టర్’, ‘డాన్‌’ (శివకార్తికేయన్‌), ‘ఈటీ’ (సూర్య) సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. తాజాగా విడుదలైన ‘కెప్టెన్‌ మిల్లర్‌’లో ధనుష్‌ సరసన మెరిసింది. ప్రస్తుతం ‘బ్రదర్‌’ (జయం రవి) చిత్రంలో నటిస్తోంది

TV9 Telugu

మరోవైపు తెలుగులోనూ హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌తో ‘ఓజీ’, నానితో ‘సరిపోదా శనివారం!’ చిత్రాల్లో నటిస్తోంది. ఆగస్టు 29న తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో నానీ మువీ విడుదల కానుంది

TV9 Telugu

రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించనున్న నాలుగో సినిమాలో ప్రియాంకను ఎంపిక చేసే అవకాశాలున్నట్లు టాక్‌. తన తొలి తెలుగు సినిమాలోని పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పింది

TV9 Telugu

చెన్నైలో పుట్టి.. బెంగళూరులో పెరిగిన ఈ బ్యూటీ బయో టెక్నాలజీ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. సినిమాల్లోకి రాకముందే తెలుగు నేర్చుకుంది. ప్రియాంక చదువుకునే రోజుల్లో థియేటర్స్‌ ఆర్ట్స్‌లో చురుగ్గా వ్యవహరించేది

TV9 Telugu

తెర వెనుక తాను ఎలా ఉంటుందో తెరపైనా అలానే ఉండాలనుకుంటుందీ భామ. మిత భాషి అంటే చాలా తక్కువ మాట్లాడుతుంది. తక్కువ మాట్లాడే వారికి స్నేహితులు తక్కువగా ఉంటారు కదా.. ఈ బ్యూటీకీ ఫ్రెండ్స్‌ తక్కువేనట