TV9 Telugu

27 february 2024

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రియాంక మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.

టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే కానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ ప్రియాంక మోహన్.

తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు బిజీగా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలు చేస్తుంది..

అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘OG’ ఒకటి. ఈ చిత్రానికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేసే ప్రియాంక.. తాజాగా అభిమానులతో ముచ్చటించింది.

ఈ క్రమంలో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పండి అని అడగ్గా.. ప్రియాంక స్పందిస్తూ.. ‘ఆయన ఒక లెజెండ్..

అద్భుతమైన మనిషి. గొప్ప లీడర్. రియల్ పవర్ స్టార్’ అంటూ కామెంట్స్ చేసింది. ప్రియాంక మాటలపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

అలాగే మరో అభిమాని.. అక్క నువ్వు ఎన్ని భాషలు మాట్లాడగలవు.? అని అడగ్గా.. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక మరో అభిమాని.. ఫోన్ హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ ఏంటని ? ప్రశ్నించగా.. అందుకు ప్రియాంక తన ఫోన్ వాల్ పేపర్ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.