TV9 Telugu

23 February 2024

ఇదే బాలీవుడ్ సీక్రెట్ అంటూ రివీల్ చేసిన ప్రియమణి.

సౌత్ సినిమాలో పాపులర్‌ అయిన హీరోయిన్ ప్రియమణి, సెకండ్ ఇన్సింగ్స్‌లో డిజిటల్ స్టార్‌గా దూసుకుపోతున్నారు.

ఓటీటీలో లీడ్ రోల్స్‌లో నటిస్తూ బాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యారు. తాజాగా నార్త్‌లో పబ్లిసిటీ స్ట్రాటజీస్‌ పై కామెంట్స్ చేశారు.

నటిగా మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ప్రియమణి. డిజిటల్ వేదికగా రీఎంట్రీ ఇచ్చారు ప్రియా.

పెళ్లికి ముందు నటిగా, గ్లామర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రీ ఎంట్రీలో మాత్రం ఓటీటీల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. 

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచి ఫామ్‌లోకి వచ్చారు ప్రియమణి. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. 

తాజాగా తన బాలీవుడ్ జర్నీ గురించి మాట్లాడిన ప్రియమణి, అక్కడి పబ్లిసిటీ కల్చర్ మీద హాట్ కామెంట్స్ చేశారు.

బాలీవుడ్‌ తారలు ఫోటో, వీడియోగ్రాఫర్స్‌కు డబ్బులిచ్చి ఎయిర్‌పోర్ట్, జిమ్ వీడియోలు, ఫోటోలు వైరల్ చేయిస్తున్నారని చెప్పారు.

జవాన్ సినిమా రిలీజ్‌ టైమ్‌లో తనకు కూడా అలాంటి ప్రపోజల్ వచ్చిందంటూ అసలు సీక్రెట్‌ను రివీల్ చేశారు ప్రియమణి.