TV9 Telugu

లక్ అంటే ప్రియమణి దే.! సెకండ్ ఇన్నింగ్ లో హిట్స్ మీద హిట్స్

12 March 2024

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అటు సినిమాలు ఇటు ఓటిటి అవకాశాలతో ఓ రేంజ్‌లో బిజీ అయిపోయారు హీరోయిన్ ప్రియమణి.

ఈ మధ్య ప్రియమణి గట్టి నమ్మకంతో చేసిన భామా కలాపం2 సినిమా కూడా ప్రేక్షకులతో ఆహా అనిపించుకుని హిట్ టాక్ తెచ్చుకుంది.

ఫస్ట్ పార్టుకి ఏమాత్రం తగ్గకుండా సెకండ్‌ పార్టు ఉందంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది భామా కలాపం సీక్వెల్‌.  

ఇక ఈ అమ్మడు నటించిన ఆర్టికల్‌ 370కి కూడా నార్త్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాక మంచి వసూళ్లు రాబట్టింది.

భామా కలాపం2 ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వూస్ లోనే ఆర్టికల్‌ 370 గురించి ఎగ్జయిటింగ్‌గా చెప్పేవారు ప్రియమణి.

2024లో ఇప్పటికే రెండు సినిమాలతో ఆల్రెడీ సక్సెస్‌లో ఉన్న ఈ డైనమిక్ లేడీ పలు మూవీస్ తో రెడీగా ఉన్నారు ప్రియమణి.

ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే 2 హిట్స్ అందుకొని ఆ సక్సెస్‌ని ఆస్వాదించే తీరిక లేనంత బిజీగా గడిపేస్తున్నారు ప్రియమణి.

పెళ్లి తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్ లో మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు ప్రియమణి.