07 March 2024
కన్నుకొట్టిన బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ప్రియా నీకు ఫిదా ఇక..
Rajitha Chanti
Pic credit - Instagram
2019లో వచ్చిన ఒరు అదార్ లవ్ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది మలయాళీ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఈ మూవీతో బ్యూటీకి క్రేజ్ వచ్చింది.
ఇందులో కన్నుకొట్టే సీన్లో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. అందం, అభినయంతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులోనూ గుర్తింపు వచ్చింది.
కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో చెక్, ఇష్క్ బ్రో సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగు, తమిళం, మలయాళంలో ఆఫర్స్ లేవు.
చివరిసారిగా బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలిగా కనిపించింది. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు నెట్టింట ఈ బ్యూటీ సందడి చేస్తుంది.
నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది ప్రియా ప్రకాష్. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
అందులో ఈ బ్యూటీ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. కమల్ హాసన్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ కన్మనీ పాటను అవలీలగా పాడేసింది ప్రియా.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ప్రియా వాయిస్.. కన్మనీ పాటను అందంగా పాడిన తీరు చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
కథానాయికగానే కాదు.. ప్రొఫెషనల్ సింగర్ గా కూడా ఈ బ్యూటీ ట్రై చేయొచ్చు.. అలాగే మరిన్ని సింగింగ్ వీడియోస్ షేర్ చేయొచ్చు కదా అంటున్నారు ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చేయండి.