హిట్ కొట్టినా .. అవకాశాలు పట్టుకోలేకపోతున్న అందాల భామ.. 

Rajeev 

28 February 2025

Credit: Instagram

 అందం, అభినయం ఉన్న అవకాశాలు లేక ఎదురుచూస్తున్న భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.

ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డేగ అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.

తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. కంచె సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినా కూడా అంతగా పాపులర్ అవ్వలేకపోయింది.

  ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గానూ ఈ అమ్మడు ఆకట్టుకుంది.

ఆతర్వాత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మరోసారి బాలకృష్ణ నటించిన డాకు  మహారాజ్ సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రావడం లేదు.