TV9 Telugu

08 February 2024

కష్టాలన్నీ కంబైండ్‌గా పూజా హెగ్డే పై పగ బట్టాయా.?

పూజా కెరీర్ ఇక ఎండ్ అయినట్లేనా.. ఈ సంకేతాలన్నీ అవే సూచిస్తున్నాయా..?

అసలు బుట్టబొమ్మ కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా..? పాపం పూజా హెగ్డే.!

రెండేళ్ల కింది వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో తెలియనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ..

ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. గతంలోనూ పూజా హెగ్డేకు ఇలాంటి షాకులు తగిలాయి.

గుంటూరు కారంలో రెండు షెడ్యూల్స్ అయ్యాక.. పూజా తప్పుకున్నారు

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ప్రకటించిన జనగణమన సైతం ఓ షెడ్యూల్ అయ్యాక ఆగిపోయింది.

అదీ పూజా కెరీర్‌పైనే ఎఫెక్ట్ చూపించింది. 2022 నుంచే పూజాకు బ్యాడ్ టైమ్ మొదలైంది.

పూజా హెగ్డే కెరీర్ గాడిన పడాలంటే.. ఇప్పటికప్పుడు ఏదైనా అద్భుతం జరగాల్సిందే.