03 May 2025

వరుసగా 7 ప్లాపులు.. ఈ హీరోయిన్ ఆశలన్నీ ఆ సినిమాపైనే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మకు ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు. ఎన్నో ఆశలతో ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి. 

తెలుగు, హిందీ, తమిళం భాషలలో బ్యా్క్ టూ బ్యాక్ సినిమాల్లో నటించింది. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రాజెక్ట్స్ అంతగా ఆకట్టుకోవడం లేదు. 

ఎంత పెద్ద హీరో పక్కన నటించినప్పటికీ ఈ అమ్మడుకు హిట్టు మాత్రం పడడం లేదు. ఈ బ్యూటీకి దాదాపు అర డజనుకుపైగా సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పటివరకు వరుస ప్లాపులతో నెట్టుకోస్తున్న ఈ అమ్మడుకు ఇప్పుడు మరో డిజాస్టర్స్ ఎదురైంది. 

పూజా హెగ్డే సక్సెస్ రుచి చూసి మూడున్నరేళ్లు దాటిపోయింది. చివరగా 2021లో డిసెంబర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ సినిమాతో హిట్టు అందుకుంది. 

ఆ తర్వాత విజయ్ దళపతితో చేసిన బీస్ట్, రామ్ చరణ్ సరసన ఆచార్య చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. 

హిందీలో సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా చిత్రాలు సైతం ప్లాప్ అయ్యాయి. మూడు భాషల్లో కలిసి వెంట వెంటనే ఖాతాలో ఆరు డిజాస్టర్స్ పడ్డాయి. 

తాజాగా భారీ అంచనాల మధ్య వచ్చిన రెట్రో అంతగా ఆకట్టుకోలేకపోయింది. విజయ్ సరసన నటిస్తోన్న జననాయగన్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.