ఇంకా ఎన్నాళ్ళు .. పూజా పాప ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఉన్నాయి 

03 December 2025

Pic credit - Instagram

Rajeev 

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో అగ్ర హీరోలందరితో కలిసి నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. 

తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. 

మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు.. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైంది.

కెరీర్ మొదట్లో ప్లాపులే అందకున్నప్పటికీ అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.

దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురంలో వంటి చిత్రాలతో వరుసగా హిట్లు అందుకుంది. 

అయితే వరుస హిట్లే కాదు.. ఆ తర్వాత వచ్చిన ప్లాపులు అమ్మాడి కెరీర్ ను అయోమయంలో పడేశాయి.

కొన్నాళ్లుగా తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. అక్కడ కూడా ప్లాపులే.. దాంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయింది.