సిగ్గెందుకు! శృంగారంపై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

11  November2025

Basha Shek

సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే కొన్ని కామెంట్లు తీవ్ర చర్చనీయాంశమవుతుంటాయి.

అలా శృంగారం గురించి ఓ టాలీవుడ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి

కెరీర్ ప్రారంభం నుంచే బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రల్లో నటిస్తోన్న ఈ అందాల తార లైంగిక విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.

'శృంగారం అనేది మన జీవితం లో ఒక భాగం. దాని గురించి ఓపెన్ గా మాట్లాడటానికి సిగ్గు ఎందుకు' అని అంటోందీ టాలీవుడ్ హీరోయిన్.

ప్రతీ ఒక్కరు దీనిని నార్మల్ గా విషయంలా డిస్కస్ చేసుకోవాలి.  లైంగిక విద్యపై అందరికీ సరైన అవగాహన ఉండాలంటోంది.

పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, ఒత్తిడి లాంటి విషయాలపై కూడా అవగాహన కల్పించాలంటోంది పాయల్ రాజ్ పుత్

 శృంగారం విషయంలో ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ విషయంలో నెటిజ్లన్లు కూడా చాలా మంది పాయల్ రాజ్ పుత్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.