పెళ్లిపీటలెక్కనున్న నివేదా థామస్! వరుడు ఎవరంటే?

TV9 Telugu

24 June 2024

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి ప్రత్యేక పరిచయం ‍అక్కర్లేదు. ఈ  కేరళ కుట్టి తెలుగులోనూ స్టార్‌ హీరోల సరసన నటించింది

అంతకు ముందు ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది నివేదా థామస్. పలు అవార్డులు కూడా గెల్చుకుంది.

ఇక తెలుగులో జెంటిల్ మెన్, వకీల్ సాబ్,నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ,  'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, 118 తదితర సినిమాల్లో మెరిసింది.

తెలుగుతో పాటు  మలయాళం, తమిళ భాషల్లో నటించి అక్కడి ప్రేక్షకులను అలరించిన నివేద త్వరలో పెళ్లిపీటలెక్కనుందని సమాచారం.

తాను ప్రేమలో పడినట్లు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది.

కొంత కాలం గడిచింది... కానీ...ఫైనల్లీ' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది నివేదా థామస్. దీంతో ఆమె పెళ్లి చేసుకోనుందంటూ ప్రచారం జరుగుతోంది.

దీనిని చూసిన వారందరూ 'కంగ్రాట్స్' అంటూ నివేదకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే మరికొందరు నెటిజన్లేమో ఏదైనా మూవీ అప్‌డేట్‌ అయి ఉంటుందేమో అంటూ కామెంట్ల పెడుతున్నారు.