22 August 2024

నివేదా పేతురాజ్ సాలిడ్ సక్సెస్ కొట్టేది  ఇంకెప్పుడు.? ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారే 

Rajeev 

Pic credit - Instagram

అందాల భామ నివేదా పేతురాజ్.. ఈ క్రేజీ బ్యూటీ తక్కువ సమయంలోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది. 

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేదా పేతురాజ్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. మెంటల్ మదిలో సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. 

2016లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే . తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో నివేదా పేతురాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మెంటల్ మదిలోతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో తన నటనతో మెప్పించింది. 

ఆతర్వాత బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, బ్లడీ మేరీ, విరాట పర్వం ,దాస్‌ కా ధమ్కీ నటించింది. 

రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది ఈ అమ్మడు. కానీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం రావడంలేదు అని అభిమానులు అంటున్నారు.