నటుడితో రెండో పెళ్లి.. కళ్యాణ మండపంలోనే కన్నీరు పెట్టుకున్న నటి!
February 27, 2024
TV9 Telugu
ప్రముఖ బుల్లితెర నటుడు సురేందర్ సహనటి నివేదితను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. వధువు నివేదిత పంకజ్‌కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం
టీవీ సీరియల్ 'మలర్'తో మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు సురేందర్-నివేదితల వివాహం ఫిబ్రవరి 24వ తేదీన బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది
'కలకాలం నీ వెంటే ఉంటాను, ఎల్లప్పుడూ నీ చేయి వదలను, ఐ లవ్ యూ..' అంటూ సురేందర్ పెళ్లి మండపంలోనే తన ప్రేమను వ్యక్తం చేయడంతో సంతోషంతో నివేదిత పెళ్లి మండపంలోనే ఏడ్చేసింది
చెన్నైలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సెలబ్రిటీల హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలగా మారాయి
మా పెళ్లిని ఇంత అందంగా చేసినందుకు, వారి ఆశీర్వాదాలను కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కుటుంబం, స్నేహితులు, కోలీగ్స్ అందరికీ ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాలో సంతోషం వ్యక్తం చేశారు
వీరి ఫొటోలు చూసిన అభిమానులు.. ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కలకాలం పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలిసి జీవించండంటూ కామెంట్లు చేస్తున్నారు
కాగా గతంలో నివేదిత నటుడు ఎస్‌ఎస్ ఆర్యన్‌ను పెళ్లాడింది. కానీ వీరి బంధం ఎంతోకాలం నిలవలేదు. వివాహం జరిగిన మూడేళ్లకే విడాకులు తీసుకుని ఎవరికి వారు వేరువేరుగా ఉంటున్నారు
తర్వాత ఆర్యన్ బుల్లితెర నటి శ్రీతిక సనీష్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇక నివేదితక కూడా సురేందర్‌ను పెళ్లాడి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు