TV9 Telugu

26 February 2024

ఆహాలో కొత్త అవతారాన్ని ఎత్తబోతోన్న నిహారిక కొణిదెల.

డైనమిక్ స్టార్ నిహారిక కొణిదెల ప్రస్తుతం ఓటీటీలో కొత్త అవతారాన్ని ఎత్తబోతోన్నారు. ఓ చాట్ షో ఆహా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చాలామంది ఎదురుచూస్తున్న చెఫ్ మంత్ర సీజన్ 3 రాబోతోంది. ఈ సీజన్‌ మొదటి ఎపిసోడ్ మార్చి 3న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ మూడో సీజన్‌లో ప్రేక్షకులకు వినోదంతో పాటు, సెలెబ్రిటీల ఫన్నీ చిట్ చాట్‌లు స్పెషల్ అట్రాక్షన్‌ కానున్నాయి.

ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆహాలో ఎపిసోడ్స్ వస్తుంటాయి. ఇప్పటికే చెఫ్ మంత్ర రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ అయ్యాయి.

ఈ సారి ఈ మూడో సీజన్‌ను నిహారిక కొణిదెల హోస్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి.

నిహారిక మార్క్‌ కనపడేలా ఈ సీజన్ ఉండబోతోంది. “చెఫ్ మంత్ర సీజన్ 3” చిత్ర పరిశ్రమలోని క్రేజీ స్టార్‌లను తీసుకురాబోతోన్నారు.

ఇందులో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండబోతోన్నాయి. నిహారిక గెస్టులతో పంచుకునే మరపురాని క్షణాలు రోలర్‌ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది.

హృదయాన్ని కదిలించే కథల నుండి ఉల్లాసకరమైన ఆటల వరకు అన్నీ కూడా “చెఫ్ మంత్ర సీజన్ 3″లో ఉండబోతోన్నాయి అనే చెప్పాలి.