నిహారిక లైఫ్ లో ఏం జరుగుతుంది.. ఎందుకు అన్ని మిస్ అవుతున్నాయి.?

Anil Kumar

01 June 2024

మెగా కాంపౌండ్ లో హీరోస్ ఓకే కానీ.. ఆ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక నటి నిహారిక కొణిదెల.

సినిమాల్లోకి రాకముందే నటనపై ఆసక్తి ఉండటంతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ప్రూవ్ చేసుకుంది నిహారిక.

ఆతర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మెగా డాటర్.

దానికి ముందు యాంకర్ గా కూడా ప్రూవ్ చేసుకుంది నిహారిక. ఎంత మెగా కాంపౌండ్ అయినా కష్టపడాల్సిందే అనేలా చేసారు.

ఇంతవరకు ఓకే.. అయితే నిహారిక సినీ ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేక పోయింది అనే చెప్పుకుంటున్నాయి సినీ వర్గాలు.

కారణాలు ఏమైనా కానీ నిహారిక హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయింది.. నటిగా కంటీన్యూ చెయ్యలేకపోయింది.

ఇక 2020లో ఛైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుంది నిహారిక.

ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఓటీటీ లో సినిమాలు, షో లు నిర్మిస్తోంది నిహారిక.. ఈ విషయంలోనూ కాస్త వెనకపడింది.