ప్రభాస్  రాజాసాబ్ పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న అందాల నిధి.. 

09 September 2025

Rajeev 

అందంలో అప్సరస ఆమె.. నటనలోనూ ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది నిధి అగర్వాల్.

మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది.

సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది.

ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశపరిచింది.

ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్‌గా నటిస్తుంది.

ప్రభాస్ సినిమా నిధి అగర్వాల్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారుని కవ్విస్తుంది.