15 July 2025

ఒక్క సినిమాతో కుర్రాళ్లకు దడ పుట్టించి.. దెబ్బకు సైలెంట్ అయ్యింది..

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ సైతం ఒకరు.

ఫస్ట్ మూవీతోనే నటిగా మెప్పించింది. కానీ ఆ తర్వాత ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ షేక్ చేసింది. దెబ్బకు యూత్ హృదయాలను దొచేసింది ఈ ముద్దుగుమ్మ. 

ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ అమ్మడు..ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీగా మారుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఈ అమ్మడు మరెవరో కాదు.. హీరోయిన్ నేహా శెట్టి. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నేహా శెట్టి. 

ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ కుర్రాళ్ల దిల్ క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ జోడిగా డీజే టిల్లు సినిమాతో భారీ హిట్ అందుకుంది. 

ఈ సినిమాతో గ్లామర్ షోతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. డీజే టిల్లు సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో రాధికగా సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. 

ఈ సినిమా తర్వాత నేహాకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కడతాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలకు దూరమైంది. 

డీజే టిల్లు తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం సినిమాలు కాకుండా నెట్టింట సందడి చేస్తుంది ఈ బ్యూటీ.