హృదయాలను ఆగం చేసిన రాధిక.. నేహాశెట్టి గురించి ఈ విషయాలు తెలుసా..
Pic credit - Instagram
డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది హీరోయిన్ నేహాశెట్టి. ఈ మూవీలో రాధిక పాత్రలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించారు.
ఈ సినిమా విజయం తర్వాత నేహాకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాకుండా తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలె కార్తీకేయ జోడిగా బెదురులంక 2012 సినిమాతో హిట్ అందుకుంది.
ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది. డిసెంబర్ 6న నేహాశెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నా్రు.
1999లో కర్ణాటకలో జన్మించింది నేహాశెట్టి. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది నేహా. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చాలా కలలు కన్నారట ఈ ముద్దుగుమ్మ.
కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ శిక్షణ తీసుకుని పలు అందాల పోటీల్లో పాల్గొన్నారామే. మిస్ మంగళూరు 2014 విజేతగా .. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్ గా టైటిల్స్ గెలుచుకుంది.
2016లో మంగారు మల్లై 2 సినిమాతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది నేహా. ఆ తర్వాత తెలుగులో ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.
ఈసినిమా తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుంది ఈ భామ. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత వచ్చిన డిజే టిల్లు సినిమాకు ఆమెకు బ్రేక్ ఇచ్చింది.
ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ రేంజ్ మారిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ బిజాగా ఉంది హీరోయిన్ నేహాశెట్టి.