ఆ యంగ్ హీరోతో రొమాన్స్‌కు నయనతార గ్రీన్ సిగ్నల్

TV9 Telugu

18 July 2024

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయన తార ప్రస్తుతం వరుస సినిమాలు షూటింగులతో బిజీబిజీగా  గడుపుతోంది.

జవాన్ తో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నయన్ ఇప్పుడు దక్షిణాది సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

అయితే జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ, అన్నపూర్ణి సినిమాల తర్వాత నయన తార నటించిన చిత్రాలేవీ థియేటర్లలోకి రాలేదు.

ఈ నేపథ్యంలో నయనతార  న‌టించే సినిమాల విడుదల కోసం మూవీ లవర్స్  అందరూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే నయన తార తర్వాతి సినిమా విష్ణు ఇడవన్ దర్శకత్వంలో చేయనుంది. ఇది డైరెక్టర్ గా విష్ణుకు  మొదటి సినిమా.

ఇందులో బిగ్ బాస్ నటుడు కెవిన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే ప్రాజెక్టులో నయనతార కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో న‌య‌న‌తార పాత్ర‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే..

ఈ సినిమాలో న‌య‌న్ కెవిన్ కంటే వ‌య‌సులో పెద్ద‌దిగా కనిపించనుందట. అయినా కూడా కెవిన్ ను ప్రేమించే పాత్ర‌లో న‌య‌న్ నటించనుందట.

ఈ సినిమాను న‌య‌న్ భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ నిర్మిస్తున్నాడు. అలాగే అనిరుధ్ రవి చందర్ స్వరాలు సమకూరుస్తున్నాడు.