29 September 2023

వామ్మో.. 50 సెకన్ల యాడ్‌కు అన్ని కోట్లా.. నయన్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా..

ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటోన్న నటీమణుల్లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఒకరు.

ఇటీవలే జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఇందులో షారుక్‌ హీరోగా నటించిన సంగతి తెలిసిందే

ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. జవాన్‌ సినిమాతో నయన్‌ క్రేజ్‌ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు

ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార ప్రకటనల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార. 

 ఇటీవల 50 సెకెన్ల యాడ్‌లో నటించిన నయనతార ఇందుకోసం ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుందట.

 దక్షిణాది ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో  కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్న నటిగా నయనతార అరుదైన రికార్డును సొంతం చేసుకుంది