అబ్బాయిలకు లేని షరతులు అమ్మాయిలకు ఎందుకు ; నయనతార 

Rajeev 

13 October 2024

 నయనతార.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్‌ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది ఈ బ్యూటీ. 

2003లో వచ్చిన మనసునక్కరే అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నయన్‌.. తన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. 

2005లో సూర్య హీరోగా నటించిన గజిని చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. 

తమిళంతోపాటు తెలుగులోనూ వరుస విజయాలను అందుకుందీ బ్యూటీ. అలాగే బాలీవుడ్ లోనూ నటించింది. 

తాజాగా నయన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడింది. 

సినిమాల్లోకి వస్తాను అంటే తన పేరెంట్స్ సపోర్ట్ చేశారని చెప్పింది నయన్.అయితే కొంతమంది మాత్రం సినీ పరిశ్రమ అంటే వెళ్లొద్దని చెబుతారు.

సినిమా అనేది కూడా ఓ కెరీర్.. ఇందులో ఈ విషయంలో అబ్బాయిలకు లేని షరతులు అమ్మాయిలకు ఎందుకు? అని నయన్ అన్నారు