50 సెకన్ల ఆ సీన్ కోసం ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసిన నయన్..

TV9 Telugu

16 March 2024

ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ఈ స్టార్ హీరోయిన్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. 

కమర్షియల్ హీరోయిన్ గా రాణిస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది నయన్ .

మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన నయన్‌ను మలయాళీ డైరెక్టర్ సత్యన్ పరిచయం చేశారు. ఆతర్వాత వరుస సినిమాలతో స్టార్ గా ఎదిగింది. 

'అయ్య', 'చంద్రముఖి', 'గజిని' వంటి సినిమాలతో తమిళ్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. 

2006లో రిలీజైన 'ఈ', 'వల్లభ' సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ ను రెట్టింపు చేశాయి. ఓ రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంది ఈ భామ . 

తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన్.. బాపు చిత్రం 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

ఇక నయన్ హీరో శింబుతో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆతర్వాత నయన్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు.

నయనతార వివాహం నటి విఘ్నేష్ శివన్ తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ లో జరిగింది.

ఇక ఈ అమ్మడు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. తాజాగా ఓ యాడ్ కోసం భారీగా డిమాండ్ చేసిందట.

ఈ ముద్దుగుమ్మ ఇటీవల 50 సెకన్ల యాడ్‌ కోసం ఏకంగా రూ.5 కోట్లు వసూలు చేసిందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.