అందం ఫుల్లు.. అవకాశాలు నిల్లు.. డైరెక్టర్స్ ఈ భామను పట్టించుకోవడం లేదే..

Rajeev 

30 September 2024

నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ వయ్యారి భామ. అందం నటనతో ఆకట్టుకుంది. 

ఈ అందాల భామ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది.

2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని సాధించడంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది.

ఆతర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తుంది.

 ఆతర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమకథ చిత్రం 2 సినిమాల్లో నటించింది. కానీ మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయింది. 

తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ఆఫర్స్ ఆదుకుంటుంది ఈ వయ్యారి భామ. ఇప్పుడు ఈ అమ్మడు సైలెంట్ అయ్యింది. 

మంగళవారం సినిమాలో పోలీస్ పాత్రలో మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది నందిత.