లుక్ మార్చేసిన లేటెస్ట్ సెన్సేషన్... మృణాల్ అదరగొట్టింది

Rajeev 

04 April 2024

బాలీవుడ్ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ చిన్నది. 

ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ చిన్నది 

ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. 

 విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటింది మృణాల్ ఠాకూర్. తాజాగా మృణాల్ కొన్ని ఫోటోలు వదిలింది.