09 November 2025

టిక్ టాక్ రీల్స్‏తో ఫేమస్.. హీరోయిన్‏గా ఛాన్స్.. ఇప్పుడు ఇలా

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు సోషల్ మీడియాలో డ‌బ్‌స్మాష్‌ వీడియోలు, రీల్స్‌ చేస్తూ తెగ పాపులర్ అయ్యింది. దీంతో దర్శకుడు త్యాగరాజన్‌ కుమార్‌ ఆమెకు కథానాయికగా ఛాన్స్ ఇచ్చారు.

2019లో విడుదలైన సూపర్‌ డీలక్స్‌ చిత్రంలో ఒక చిన్న పాత్రలో ఆమె నటించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన నటించిన గద్దలకొండ గణేష్ సినిమాతో పాపులర్ అయ్యింది.

ఆమె పేరు మృణాళిని రవి. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారి తన మార్కెట్ పెంచుకుంది. తక్కువ సమయంలోనే క్రేజ్ సైతం సొంతం చేసుకుంది.

కానీ ఆ తర్వాత ఆశించినస్థాయిలో అవకాశాలు రాలేదు. తాజాగా ఈ అమ్మడు కొత్త కారును కొనుగోలు చేసింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా కంపెనీ ఈ కారును కొన్నది.

మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ SUV లగ్జరీ కారును మృణాళిని రవి కొనుగోలు చేసింది. ఆ కారు మోడల్‌ను దక్కించుకున్న మొదటి వ్యక్తి తనే కావడం విశేషం.

సరికొత్త ఫీచర్స్‌ ఉన్న ఈ కారు ధర రూ. 28 లక్షల వరకు ఉంది.  బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ BE6 మోడల్‌ కారును ఇప్పటికే పలువురు స్టార్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

కానీ సౌత్ ఇండస్ట్రీలో ఈ కారును సొంతం చేసుకున్న ఫస్ట్ హీరోయిన్ మృణాళిని కావడం విశేషం. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోయినప్పటికీ భారీగానే సంపాదిస్తుంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్టూ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ ఆకట్టుకుంటున్నాయి.