ఓ వైపు కుర్ర హీరోలు.. మరో వైపు సీనియర్ హీరోలు.. మీనాక్షి స్పీడ్ మాములుగా లేదుగా..

Rajeev 

13 July 2024

సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తుంది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో తన నటనతో పాటు అందాలతో కుర్రాళ్లను కవ్వించింది.

మీనాక్షి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆతర్వాత అడవి శేష్ నటించిన హిట్ 2 సినిమాతో హిట్ అందుకుంది

కెరీర్ లో ఒకొక్క మెట్టు ఎక్కుతూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది మీనాక్షి చౌదరి. ఇటీవలే మహేష్ బాబుతో సినిమా చేసింది.

ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాలో చేస్తుంది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ తో నటిస్తుంది. ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేస్తుంది.

ఓవైపు యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తూనే మరో వైపు సీరియర్ హీరోలతోనూ జతకడుతుంది మీనాక్షి చౌదరి.