TV9 Telugu

04 January 2024

‘గుంటూరు కారం’లో మీనాక్షి చౌదరి కనిపించిందండోయ్..

‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా నటిస్తుంది.

అయితే ఇప్పటి వరకు ఈమె పాత్రను కానీ.. ఎలా ఉండబోతుందని గానీ పరిచయం చేయలేదు.

టీజర్‌లో శ్రీలీలను చూపించకపోయినా.. ఆ తర్వాత వచ్చిన పాటల్లో మాత్రం ఆమెను బాగానే హైలైట్ చేసాడు గురూజీ.

ఇలాంటి సమయంలో మీనాక్షిని మాత్రం ఇప్పటి వరకు చూపించకపోవడంపై ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

ఇందులో ఆమె రాజీ పాత్రలో నటిస్తుంది. ప‌రికిణీ వేసి ఓణీలో చాలా ప‌ద్ధ‌తిగా తెలుగమ్మాయిగా కనిపించింది మీనాక్షి చౌదరి.

ఇందులో ఈమెది చాలా చిన్న పాత్రే అని తెలుస్తుంది. ఈ కారెక్టర్‌తో మీనాక్షి జాతకం మారుతుందా లేదా అనేది చూడాలి.

ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ల‌కు అంతగా గుర్తింపు రాదు.

మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు మీనాక్షి బ్రేక్ చెప్తుందా లేదా అనేది చూడాలి. జనవరి 12న విడుదల కానుంది గుంటూరు కారం.