లక్కీ మీనాక్షి.. వరుస సినిమాలతో బిజీ బిజీగా 

Rajeev 

21 October 2024

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ఎక్కడ చూసిన ఈ అమ్మడి ఫొటోలే.. 

ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది.

ఈ సినిమా నిరాశ పరిచినా  మీనాక్షి చౌదరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అందంతోనూ ఆకట్టుకుంది. 

ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాలో తన గ్లామర్ తో కుర్రకారును కవ్వించింది మీనాక్షి. 

ఆతర్వాత హిట్ 2 సినిమాతో హిట్ అందుకుంది. ఇలా కెరీర్ లో ఒకొక్క మెట్టు ఎక్కుతూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది మీనాక్షి.

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. 

ప్రస్తుతం మట్కా, మెకానిక్ రాకీ, లక్కీ బాస్కర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది మీనాక్షి. లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.