TV9 Telugu
05 January 2024
అందంగా ఉన్నారు, వయసు తక్కువే.. రిపోర్టర్ ప్రశ్నకు మీనా క్రేజీ రిప్లై.
రీసెంట్ డేస్లో రిపోర్టర్లు కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నారు. సెలబ్రిటీలను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు.
ఇక తాజాగా మీనాను కూడా ఓ రిపోర్టర్ ఇలాగే చేశారు. ఎబ్బెట్టుగా ఉండే ప్రశ్నకు అడిగేశారు.
అయితే మీనా లైట్‌గా తీసుకున్నప్పటికీ నెటిజన్లు మాత్రం ఈ రిపోర్టర్‌ను ఏకిపారేస్తున్నారు.
'అందంగా ఉన్నారు, వయసు కూడా తక్కువే ఉంది. రెండో పెళ్లి చేసుకుంటారా.? అని పదే పదే అదే ప్రశ్నను మీనాపై సందించారు ఓ రిపోర్టర్.
ఒకసారి కాదు తిప్పి తిప్పి అదే ప్రశ్నను అడిగి మీనాకు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు. అయితే మీన కూడా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చింది.
పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడైతే తనకు లేదని చెప్పింది. ఎవర్నీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావా.?
తన జీవితం గురించి తానెప్పుడు ముందే అనుకోలేదని తక్కువ వయసు, ఎక్కువ వయసు అని కాదని..
తన భవిష్యతు గురించి తను ఇంకా ఊహించలేకపోతున్నాను అంది. తానే కాదు ఎవరూ అలా ఊహించలేరంటూ చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి