TV9 Telugu
షాకింగ్.. హీరో ధనుష్ తో మీనా రెండో పెళ్లి.? మీనా క్లారిటీ.
26 March 2024
ఈ మధ్యన ప్రముఖ నటి మీనా వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి అనే చెప్పాలి.
ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారంపై ఇప్పటికే పలు మార్లు క్లారిటీ ఇచ్చింది మీనా.
అయినా నెట్టింట మీనాపై దాడి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా హీరో ధనుష్ తో లింక్ చేస్తూ రెండో పెళ్లి అంటూ రూమర్స్ చేస్తున్నారు.
ఇలాంటి రూమర్స్ పై పలుమార్లు స్పందించిన మీనా తాజాగా మరోసారి ఇదే విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది..
"డబ్బు కోసం ఏమైనా రాస్తారా.? సోషల్ మీడియా రోజురోజుకు మరింత దిగజారిపోతుంది. నిజాలు తెలుసుకుని రాయండి.
అది అందరికీ మంచిది. దేశంలో నాలాగే ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు. మా పేరెంట్స్, కూతురు గురించి కూడా కొంచెం ఆలోచించండి.
ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో తెలియదు.
రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నేనే ఓపెన్ గా చెప్తాను. అంతవరకు ఇలాంటి పుకార్లను సృష్టించవద్దు అని ఆగ్రహం వ్యక్తం చేసింది మీనా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి