అందం తపస్సు చేసిందేమో ఈమె చెలిమి కోసం.. మానుషి ఆసమ్ లుక్స్..
25 September 2024
Battula Prudvi
14 మే 1997న హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో హర్యాన్వి కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ మానుషి చిల్లర్.
ఆమె తండ్రి డాక్టర్. మిత్రా బసు చిల్లార్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఫిజిషియన్ మరియు సైంటిస్ట్ గా ఉన్నారు.
ఆమె తల్లి డాక్టర్ నీలం చిల్లార్ కూడా వైద్యురాలు మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్‌లో న్యూరోకెమిస్ట్రీ అనుబంధ శాస్త్రాలు విభాగానికి డిపార్ట్మెంటల్ హెడ్.
న్యూ ఢిల్లీలో సెయింట్ థామస్ స్కూల్ చదువుకుంది. 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో ఆల్ ఇండియా CBSE టాపర్‌గా నిలిచింది.
మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించి సోనిపట్‌లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజీలో మెడికల్ డిగ్రీ (MBBS) చదువుతోంది.
2017లో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్‌ను గెలుచుకుంది ఈ బ్యూటీ.
మిస్ వరల్డ్ 2017 పోటీ విజేత. 17 సంవత్సరాల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన భారతదేశం నుండి ఆరవ ప్రతినిధిగా నిలిచింది.
2022 నుంచి నటనలో కెరీర్ మొదలుపెట్టింది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగులో తొలిసారి నటించింది ఈ బ్యూటీ.