16 August 2024
ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికైన మానసి పరేఖ్.. ఆమె ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ నటిగా నిత్యా మీనన్, మానసి పరేఖ్ నిలిచారు.
నిత్యామీనన్ సౌత్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమెతోపాటు ఉత్తమ నటిగా ఎంపికైన మానసి పరేఖ్ గురించి నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.
గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో తన నటనకుగానూ మానసి ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇది ఆమెకు ఐదో సినిమా కావడం గమనార్హం.
బుల్లితెరపై గుర్తింపు మానసి కిత్నీ మస్త్ హై జిందగీ సీరియల్ ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించింది. దీంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
2012లో విడుదలైన లీలైతో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2019లో రిలీజైన ఉరి. ది సర్జికల్ స్ట్రయిక్ లో ఆకట్టుకుంది.
ఆ తర్వాత గుజరాతీ చిత్రాల్లోనే నటిస్తూ వస్తున్నారు. ఎన్నో సినిమాల్లో అలరించింది. అలాగే పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది.
సీరియల్స్, సినిమాలకే కాకుండా తన ప్రతిభను చూపించేందుకు ప్రతి వేదికను వినియోగించుకుంది. వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
నటిగానే కాకుండా సింగర్ గా రాణించింది. గాయకుడు పార్థివ్ గోహిల్ తో మానసి వివాహం 2018లో వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి.