TV9 Telugu

10 February 2024

చాల రోజుల తరువాత బయటకొచ్చిన ఒకప్పటి హీరోయిన్.. కొత్త కార్ తో.

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన భామల్లో మమతామోహన్ దాస్ ఒకరు.

ముఖ్యంగా యమదొంగ సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

నటిగానే కాదు సింగర్ గాను మమతా చాలా ఫెమస్. ఆమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.

కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్‌, కేడి ఇలా అనేక సినిమాలు చేసింది.

తమిళ, కన్నడ భాషల్లో యాక్ట్‌ చేసినా ఎక్కువగా మలయాళంలోనే గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా ఈ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేసింది. బీఎమ్‌డబ్ల్యూ Z4 M40i స్పోర్ట్స్‌ కారు కొనుగోలు చేసింది.

ఇందుకు సంబందించిన ఫొటోస్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.