01 September 2024

స్పీడ్ మీదున్న కోలీవుడ్ బ్యూటీ.. బాలీవుడ్‏లోకి రాజాసాబ్ హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా దూసుకుపోతుంది ఈ అమ్మడు.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, క్రేజీ వీడియోస్ నెట్టింట షేర్ చేస్తూ అలరిస్తుంది. 

ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అయిన తంగలాన్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యాక్టింగ్ అదరగొట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

ఈ చిత్రం తెలుగు, తమిళంలో పెద్ద విజయం సాధించింది. ఇంతలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానున్నట్లు సమాచారం. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. 

తాజాగా ఈ బ్యూటీ హిందీలో యుధ్రా చిత్రంలో నటిస్తుంది. ఈ వారం విడుదలైన ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఈ చిత్రంలో మాళవిక వేడెక్కించే గ్లామరస్ అవతారంలో కనిపించడమే కాకుండా రొమాన్స్ లోనూ అదరగొట్టింది. ఇందులోయువహీరో సిద్దాంత్ చతుర్వేది.

త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇదే సమయంలో మాళవిక కొత్త ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో మాళివిక హాట్ గా కనిపిస్తుంది.