15 December 2023
యానిమల్ పార్క్ సినిమాలో ఆఫర్ కొట్టేసిన సౌత్ బ్యూటీ.!
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది.
అయితే ఈ సినిమాకు సెకండ్ పార్ట్ రాబోతుందని సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు.
అంతే కాకుండా యానిమల్ సినిమా రెండో భాగం పేరు యానిమల్ పార్క్ అని తెలిపారు.
డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ ఇప్పటివరకు దాదాపు 800 కోట్లు వసూలు చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెకండ్ పార్ట్ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది.
తాజాగా రెండో భాగంలో హీరోయిన్గా మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ ఎంపికైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ప్రయత్నాలు చేస్తుంది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి