27 June 2025

అమెరికాలో జాబ్ మానేసి రీఎంట్రీ.. ఒకప్పుడు తోపు హీరోయిన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. తెలుగులో ఆనతికాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అచ్చతెలుగమ్మాయి. 

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగువారికి ఇష్టమైన అమ్మాయిగా మారిపోయింది. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. 

పెళ్లి తర్వాత అమెరికాలో ఐటీ జాబ్ చేస్తూ బిజీగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు తన సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి తిరిగి సినిమాల్లోకి అడుగుపెడుతుంది. 

ఆమె మరెవరో కాదండి.. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ లయ. ఇప్పుడు నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా పలు విషయాలు పంచుకుంది. 

 పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన తాను 2023లో ఇండియాకు వచ్చినప్పుడు పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చానని చెప్పుకొచ్చింది లయ. 

ఆ ఇంటర్వ్యూలో చూసి తమ్ముడు టీం తనకు ఫోన్ చేసి అడిగారని తెలిపింది. ఈ సినిమా కోసం స్వీట్స్ బాగా తిని దాదాపు 7 కిలోలు బరువు పెరిగినట్లు తెలిపారు. 

తమ్ముడు సినిమా కోసం హైదరాబాద్ లో ఉన్నప్పుడే అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ మానేశానని.. ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని అనుకుందట. 

ఈ సినిమా తర్వాత కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించాలని అనుకుంటున్నానని.. తనకు అమెరికాతోపాటు హైదరాబాద్ లోనూ ఇళ్లు ఉందని తెలిపింది.