మంటలు రేపుతోన్న మెగా ఇంటి కోడలు పిల్ల.. 

Rajeev 

27 March 2024

అందాల రాక్షసి సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి ఆతర్వాత వరుస సినిమాలతో ఆకట్టుకుంది.

అందాల రాక్షసి సినిమాలో క్యూట్ లుక్స్ తో అమాయకపు మాటలతో ఆకట్టుకున్న లావణ్య. ఆతర్వాత యంగ్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.

చదువు పూర్తి చేసిన తరువాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది ఆతర్వాత పలు టీవీ కార్యక్రమాల్లో కనిపించి ఆకట్టుకుంది.

2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుంది ఈ బ్యూటీ. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ కాలేక పోయింది లావణ్య.

ఇక గతఏడాది మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని మెగా కోడలు అయ్యింది ఈ చిన్నది. వీరి వివాహం నవంబరు 01న జరిగింది.

టాలీవుడ్ లో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ ల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది లావణ్య త్రిపాఠి.

పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది. ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి అలరించింది లావణ్య.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.