07 February 2025

ఆఫర్స్ లేక స్పెషల్ సాంగ్స్‏కు సై అంటోన్న హీరోయిన్.. నిజమేనా..?

Rajitha Chanti

Pic credit - Instagram

ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో సంచలనంగా మారింది హీరోయిన్ కృతి శెట్టి. విడుదలకు ముందే ఈ అమ్మడు స్టార్ డమ్ సంపాదించుకుంది. 

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి చిత్రంలోనే అందం, అభినయంతో కుర్రకారు ఫేవరేట్ నటిగా మారింది. 

తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది కృతి. శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హిట్స్ అందుకున్నా తర్వాత ప్లాప్స్ వచ్చాయి. 

కృతి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తుంది ఈ బ్యూటీ. 

ఇదిలా ఉంటే.. కృతి శెట్టి ఇప్పుడు సరికొత్త డెసిషన్ తీసుకుందట.ఈ అమ్మడు ఇకపై సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అయ్యిందట. 

ఇప్పటికే సమంత, కాజల్, పూజా హెగ్డే, శ్రుతీ హాసన్, శ్రీలీల, ఫరియా అబ్దుల్లా వంటి హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. 

త్వరలోనే కృతి శెట్టి బాలీవుడ్ లోని ఓ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. దీనిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. 

అద్భుతమైన డ్యాన్స్ చేయడంతో కృతికి మంచి గుర్తింపు ఉంది. దీంతో ఇప్పుడు ఆమె చేయబోయే స్పెషల్ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.