TV9 Telugu

బేబమ్మ ఈజ్ బ్యాక్.! చాల గ్యాప్ తరువాత క్రేజీ ఆఫర్స్ అందుకున్న కృతి.

03 April 2024

ఓవర్ నైట్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారిలో హీరోయిన్ కృతి శెట్టి ఒకరు.

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యిన కృతిశెట్టి ఈ ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

మొదట్లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి శెట్టి ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో కృతికి ఆఫర్స్ తగ్గాయి.

తర్వాత తమిళ్, మలయాళం లోను సినిమాలు చేస్తోంది. మలయాళంలో ‘అజయంతే రాండమ్ మోషన్’ అనే సినిమాలో నటిస్తోంది.

నెక్స్ట్ కార్తీతో తమిళ సినిమా చేయడానికి రెడీ అయ్యింది ఈ మంగళూరు బ్యూటీ. దీనికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది.

ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో నటించేందుకు సిద్ధంగా ఉంది ఈ అమ్మడు.ఇక ఇప్పుడు రెండు క్రేజీ ఛాన్స్ కొట్టేసింది.

తెలుగులో ఫ్యామిలీ మాన్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే తమిళ్ లోనూ జయం రవి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది.