హిట్ కొట్టిన ఈ అందాల భామను పట్టించుకోవడం లేదే.. 

17 August 2025

Rajeev 

కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆకాష్ పూరి హీరోగా  వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 

ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా  బ్రో సినిమాలో చేసింది. 

కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ ఈ అమ్మడి అందానికి మంచి మార్కులు పడ్డాయి. 

మధ్యలో ఈ చిన్నది స్పెషల్ సాంగ్ లోనూ మెరిసింది. నితిన్ నటించిన రాబిన్ హుడ్ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. 

ఇక ఇటీవలే శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఎట్టకేలకు ఈ అమ్మడి ఖాతాలో హిట్ పడింది. 

ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగడం లేదు.. ప్రస్తుతం కేతిక చేతిలో సినిమాలు ఏవి లేవు.

కానీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.