ఆ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తానంటున్న కీర్తిసురేష్.. ఆయన ఎవరంటే 

Rajeev 

17 August 2024

కీర్తి సురేష్ తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. త్వరలోనే హిందీలోనూ సినిమా చేస్తోంది. 

తెలుగులో మహానటి సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రకు గానూ జాతీయ అవార్డును కూడా అందుకుంది. 

కీర్తి సురేష్ తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్ వంటి పాన్-ఇండియన్ భాషలలో కూడా క్రేజ్ సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం సుమన్ కుమార్ దర్శకత్వంలో రఘుతాత చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్న కీర్తి సురేష్, నటుడు సూర్యతో సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని తెలిపింది. 

అప్పుడప్పుడు కథ రాస్తానని .. హీరో సూర్యతో సినిమా చేయాలనీ ఉందని ఆయనను డైరెక్ట్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. 

తెలుగులో చివరిగా భోళాశంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.