కీర్తి సురేష్‌ను వెంటాడుతున్న  బ్యాడ్ లాక్.. 

09 September 2025

Rajeev 

క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ కీర్తిసురేష్. టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. 

కీర్తిసురేష్ హీరోయిన్ గా తమిళ్ సినిమాతో పరిచయమైనప్పటకి..మలయాళంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.

2015లో వచ్చిన ఇదు ఎన్న మాయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ చిన్నది. 

ఈ చిన్నది ఆతర్వాత మహానటి సినిమాతో పాపులర్ య్యింది. ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.

ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.  అలాగే హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది. 

ఇక కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లోనూ సినిమా చేసింది కీర్తి.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తెలుగులో ఉప్పుకప్పురంబు అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.