08 October 2024

సినిమా హిట్ కావాలని ఉపవాసం ఉంటున్న హీరోయిన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవుతున్న హీరోయిన్ కావ్య థాపర్. ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఈ సినిమాతో గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం ఏక్ మినీ కథ, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల్లో నటించింది. 

ప్రస్తుతం టాలెంటెడ్ హీరో గోపిచంద్ సరసన విశ్వం మూవీలో నటించింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. 

ప్రస్తుతం చిత్రయూనిట్ మొత్తం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కల్చర్స్ ఎక్కువగా ఫాలో అవుతానని.. నవరాత్రికి మన సంస్కృతిలో ఏం చేస్తారో అవన్నీ చేస్తానని.. ఉపవాసం కూడా ఉంటానని తెలిపింది.

మొదటి సారి నవరాత్రి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటున్నానని.. విశ్వం సినిమాకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాని చెప్పింది. 

అందుకే కేవలం సాత్వికాహారం లాంటిది మాత్రమే తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. సినిమా హిట్ కోసం ఉపవాసం ఉందని తెలిసి షాకయ్యారు. 

కావ్య థాపర్ కు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో.. నెట్టింట క్రేజీ ఫోటోషూట్లతో ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.