06 October 2024
అయ్యో.. కత్రినా కైఫ్‌కు ఏమైంది..? చేతికి నల్లటి ప్యాచ్‌తో హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి చర్చ జరుగుతుంది. అసలు ఈ హీరోయిన్‌కు ఏమైంది.. ? అనేది చర్చ.
ఇటీవల చీరకట్టులో ఎయిర్ పోర్టులో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ బ్యూటీ. అక్కడే ఫోటోలకు తనదైన శైలిలో ఫోజులిచ్చింది.
ఈ క్రమంలోనే ఆమె కుడి చేతికి ఉన్న నల్లటి ప్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి.
ఆమె చేతికున్న ప్యాచ్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కత్రినా ఆరోగ్యానికి ఏమైంది ? అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు
కత్రినా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుందా ? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ నల్లటి ప్యాచ్‌కు వేరే కారణం ఉంది.
సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడానికి ఉపయోగించే డయాబెటిస్ ప్యాచ్ అయి ఉంటుందని ఫోటోస్ చూస్తే తెలుస్తోంది
నిరంతర గ్లూకోజ్ మానిటర్స్ అని కూడా పిలిచే ఇలాంటి ప్యాచులను మధుమేహం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారట నివేదికలు చూస్తే తెలుస్తోంది.
ఇది పెట్టడం వల్ల చేతి వేలును సూదితో గుచ్చి రక్త పరీక్ష చేసుకునే అవసరం ఉండదట. అయితే కత్రినా ఎందుకు ధరించిందనేది తెలియాల్సి ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి.